Mon Mar 23 2026 04:47:45 GMT+0530 (India Standard Time)
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం

శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద తుఫాను బాధితుల ఆందోళన ఉదృక్తతకు దారితీసింది. అధికారులు తమను అదుకోవడం లేదని, కనీసం తాగునీరు, ఆహారం, పునరావాసం కూడా కల్పించడం లేదని ఆరోపిస్తూ తుఫాను బాధితులు సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అధికారుల వైఖరికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిరియా సాయిరాజ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తుఫాను బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
Next Story

