Tue Mar 24 2026 07:30:32 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీ జంప్ జిలానీలకు ఝలక్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన 23 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు మళ్లీ ఝలక్ ఇచ్చింది. ఇందులో నలుగురు మంత్రులు కూడా ఉన్నారు. వీరికి నోటీసులు జారీ చేయాలని ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం విశేషం. పార్టీ ఫిరాయింపులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా నలుగురు మంత్రులు, ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించడంతో కొంత ఇబ్బంది పడక తప్పదన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
Next Story

