Fri Mar 20 2026 11:43:49 GMT+0530 (India Standard Time)
వైసీపీ నేత కుమారుడి ఆత్మహత్య

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, కర్నూల్ జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జున రెడ్డి(28) శుక్రవారం తన నివాసంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీటెక్ పూర్తి చేసిన నాగార్జున రెడ్డి ఇటీవలే బెంగళూరులో వ్యాపారంలో సెటిల్ అయ్యాడు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story

