Wed Mar 18 2026 22:41:43 GMT+0530 (India Standard Time)
ఛార్జ్ షీట్ వెనుక ఇంత కథ ఉందా..?

ప్రతిపక్ష నేత జగన్ కు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఓ వర్గం మీడియాతో కలిసి టీడీపీ ప్రభుత్వం వైసీపీపై దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం విమర్శించారు. భారతి సిమెంట్స్ లో అంతా చట్టప్రకారమే ఉన్నా, ఎలాంటి తప్పులు జరగకున్నా ఈడీ ఛార్జ్ షీట్ లో భారతి పేరును నమోదు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏడేళ్ల తర్వాత ఛార్జ్ షీట్ లో చేర్చడమేంటని ప్రశ్నించారు. ఛార్జ్ షీట్ లో తన పేరు పెట్టిన విషయం ఆమెకు తెలియకముందే ఎల్లో మీడియాకు ఎలా లీకైందని, ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే ఇద్దరు అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి కావాల్సినట్లు బీజేపీ కేసును నడిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్ని ఆరోపణలు చేసినా జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు.
Next Story

