Sun Feb 01 2026 10:05:07 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సంచలన నిర్ణయం

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీ లేదా ఆ పార్టీ మిత్రపక్షాల అభ్యర్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేది లేదని ఆ పార్టీ ఎంపి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో హోదా ఇస్తుందనే ఆశతోనే బీజేపీకి మద్దతు ఇచ్చామని, కానీ, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన బీజేపీకి వైసీపీ ఎట్టి పరిస్థితిలోనూ మద్దతు ఇవ్వదని పేర్కొన్నారు. చంద్రబాబు అవసరానికి తగ్గట్లుగా మాట్లాడతారని, చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే చంద్రబాబు సింగపూర్ వెళ్లారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అక్రమాస్తులపై విచారణ జరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగానికి చంద్రబాబు ప్రమాదకరమైన వ్యక్తి అని విమర్శించారు.
Next Story

