డీజీపీకి వైసీపీ, టీడీపీ నేతల ఫిర్యాదులు
చలో ఆత్మకూరుపై ఘటనపై వైసీపీ, టీడీపీ లు పోటాపోటీగా ఏపీ డీజీపీకి ఫిర్యాదులు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం టీడీపీ తలపెట్టిన చలో ఆత్మకూరు ఘటనపై ఏపీ [more]
చలో ఆత్మకూరుపై ఘటనపై వైసీపీ, టీడీపీ లు పోటాపోటీగా ఏపీ డీజీపీకి ఫిర్యాదులు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం టీడీపీ తలపెట్టిన చలో ఆత్మకూరు ఘటనపై ఏపీ [more]

చలో ఆత్మకూరుపై ఘటనపై వైసీపీ, టీడీపీ లు పోటాపోటీగా ఏపీ డీజీపీకి ఫిర్యాదులు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం టీడీపీ తలపెట్టిన చలో ఆత్మకూరు ఘటనపై ఏపీ పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును గృహనిర్భందం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో చంద్రబాబును కలిసేందుకు నన్నపనేని రాజకుమారి మరికొందరు మహిళా నాయకులు చంద్రబాబు నివాసానికి రావడం , వీరిని అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై అనురాధ అడ్డుకోవడం తెలిసిందే. టీడీపీ నాయకులను సదరు ఎస్సై చంద్రబాబు నివాసంలోకి అనుమతించలేదు. దీంతో రాజకుమారి విధుల్లో ఉన్న ఎస్సై అనురాధపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై నిన్న ఎస్సై ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు నన్నపనేని రాజకుమారితో పాటు మరొకరిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో భాగంగా కేసు నమోదైన నన్నపనేనిపై చర్యలు తీసుకోవాలని ఆమె దళితులపట్ల అమానుషంగా మాట్లాడారని వైసీపీ నేతలు ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మరో వైపు టీడీపీ నేతలు సైతం వైసీపీ నాయకులపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని డీజీపీకి వివరించారు. దీంతో రెండు పక్షాల నుంచి ఫిర్యాదు తీసుకున్న డీజీపీ వాటిని పరిశీలిస్తున్నారు.
