Sun Mar 22 2026 13:22:21 GMT+0530 (India Standard Time)
జగన్ లేని యాత్ర..?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాలో జగన్ పాత్ర ఉండదని తెలుస్తోంది. మొదట జగన్ పాత్రలో తమిళ నటులు సూర్య, కార్తి నటిస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల హీరో విజయ్ దేవరకొండ కూడా జగన్ పాత్రలో కనిపిస్తారని అన్నారు. కానీ, సినిమాలో అసలు జగన్ పాత్రే ఉండదని ఇప్పుడు తెలుస్తోంది. కేవలం వైఎస్ చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర పైనే చిత్రం ఉండనున్న నేపథ్యంలో అప్పట్లో జగన్ ప్రజా జీవితంలో లేనందున ఆయన పాత్ర సినిమాలో కనిపించదని తెలుస్తోంది.
Next Story

