Mon Mar 23 2026 21:04:03 GMT+0530 (India Standard Time)
సిన్హా...కమలానికి బై బై చెప్పేశారు

బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా పార్టీని వీడారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. యశ్వంత్ సిన్హా గత కొంతకాలంగా మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆయనను బీజేపీ అగ్రనాయకత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన బీజేపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకపోవడానికి కేంద్ర వైఖరే కారణమంటూ సిన్హా దుయ్యబట్టారు. తాను ఏ పార్టీలో చేరబోనని యశ్వంత్ తెలిపారు.
Next Story

