Thu Mar 19 2026 04:11:03 GMT+0530 (India Standard Time)
ఈ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది
దేవినేని ఉమపై వైసీపీ నేతలు హత్యాయత్నం చేశారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఉమ అరెస్ట్ ను ఆయన ఖండించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత [more]
దేవినేని ఉమపై వైసీపీ నేతలు హత్యాయత్నం చేశారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఉమ అరెస్ట్ ను ఆయన ఖండించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత [more]

దేవినేని ఉమపై వైసీపీ నేతలు హత్యాయత్నం చేశారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఉమ అరెస్ట్ ను ఆయన ఖండించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో సహజవనరుల దోపిడీ పెరిగిపోయిందన్నారు. అక్రమ మైనింగ్ ను అడ్డుకుంటే హత్యాప్రయత్నం చేస్తారా? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేంటని యనమల నిలదీశారు. ఈ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించే ఇలాంటి వికృత చేష్టలకు దిగుతుందని యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సహజవనరుల దోపిడీని అడ్డుకోబోయినందుకు దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు.
Next Story