Thu Mar 19 2026 05:47:38 GMT+0530 (India Standard Time)
ప్రభుత్వం తప్పును కప్పి పుచ్చుకునేందుకు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ఆక్సిజన్ అందక సంభవించిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా జగన్ పట్టించుకోరా? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ప్రభుత్వ చేతకాని తనాన్ని వైద్యులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఆక్సిజన్ నిల్వలను పెంచుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని యనమల రామకృష్ణుడు హితవు పలికారు.
Next Story