Sat Dec 06 2025 07:47:49 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సెలెక్ట్ కమిటీ ముందు ఉన్నాయని ప్రభుత్వం న్యాయస్థానంలోనూ [more]
మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సెలెక్ట్ కమిటీ ముందు ఉన్నాయని ప్రభుత్వం న్యాయస్థానంలోనూ [more]

మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సెలెక్ట్ కమిటీ ముందు ఉన్నాయని ప్రభుత్వం న్యాయస్థానంలోనూ అంగీకరించిందని చెప్పారు. రాజధానుల బిల్లును మండలి పాస్ చేయాలేదని చెప్పారు. పెండింగ్ లో ఉన్న బిల్స్ ను పంపడంపై గవర్నర్ ఆలోచించాలన్నారు. దీనిపై గవర్నర్ అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకోవాలని యనమల రామకృష్ణుడు కోరారు. ప్రజల అభిప్రాయాలు, లీగల్ అంశాలను కూడా గవర్నర్ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఏపీలో కరోనా తీవ్రత ఉంటే ఇప్పుడు మూడు రాజధానుల అంశం అవసరమా? అని యనమల ప్రశ్నించారు. వివాదాస్పదమైన బిల్లులపై గవర్నర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
Next Story