Tue Dec 16 2025 20:00:15 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఎందుకు దాస్తున్నారో చెప్పాలి
మద్యం ధరల పెంపుతో ఆదాయన్ని ప్రభుత్వం దాస్తుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మద్యం ధరల పెంపుతో ఎంత ఆదాయం వచ్చిందనేది ప్రభుత్వం బయటకు చెప్పాలన్నారు. [more]
మద్యం ధరల పెంపుతో ఆదాయన్ని ప్రభుత్వం దాస్తుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మద్యం ధరల పెంపుతో ఎంత ఆదాయం వచ్చిందనేది ప్రభుత్వం బయటకు చెప్పాలన్నారు. [more]

మద్యం ధరల పెంపుతో ఆదాయన్ని ప్రభుత్వం దాస్తుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మద్యం ధరల పెంపుతో ఎంత ఆదాయం వచ్చిందనేది ప్రభుత్వం బయటకు చెప్పాలన్నారు. 75 శాతం ధరల పెంపుతో పేద, మధ్య తరగతి ప్రజలపైనే భారం పడుతుందన్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కునే నైజం జగన్ ది అని యనమల రామకృష్ణుడు అన్నారు. మద్యనిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ మద్యం ద్వారా భారీగా ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పటికైనా మద్యం ద్వారా వచ్చిన రాబడి ఎంతో చెప్పాలని ప్రభుత్వాన్ని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
Next Story