Thu Mar 19 2026 07:18:10 GMT+0530 (India Standard Time)
వైరస్ ను వైసీపీ నేతలు అంటిస్తున్నారు.. యనమల ధ్వజం
వైసీపీ నేతలు గుంపులు గుంపులుగా తిరగడం వల్లనే కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల్లో [more]
వైసీపీ నేతలు గుంపులు గుంపులుగా తిరగడం వల్లనే కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల్లో [more]

వైసీపీ నేతలు గుంపులు గుంపులుగా తిరగడం వల్లనే కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల్లో ఎనిమిదో స్థానంలోనూ, మరణాల్లో ఆరో స్థానంలోనూ ఆంధ్రప్రదేశ్ ఉందని యనమల దెప్పి పొడిచారు. జగన్ నిర్లక్ష్యం వల్లనే అధికారులు తొలినాళ్లలో అశ్రద్ధ వహించారన్నారు. అందువల్లనే ఏపీలో కరోనా వ్యాప్తి చెందిందన్నారు. వైసీపీ నేతల తీరును కేంద్ర మంత్రులు కూడా తప్పుపట్టారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ప్రభుత్వం దారి మళ్లించారని యనమల ఆరోపించారు. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో వైరస్ వ్యాప్తికి వైసీపీ నేతలే కారణమని చెప్పారు.
Next Story