Sun Mar 22 2026 06:18:48 GMT+0530 (India Standard Time)
జగన్ గురించి యనమల ఏమన్నారంటే...?

తెలంగాణలో టేపుల సంభాషణ గురించి పదేపదే మాట్లాడే వైసీపీ అధినేత జగన్, కర్ణాటకలో ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగిన గాలి జనార్ధన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. గాలి జనార్ధన్ రెడ్డి జగన్ కి దేవుడిచ్చిన అన్న కాబట్టే మాట్లాడటం లేదా అని అన్నారు. కర్ణాటకలో బీజేపీ గాలి, శ్రీరాములును ఉపయోగించుకుని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొగుగోలు చేసే ప్రయత్నం చేసిందన్నారు. అయినా, బీజేపీ, జగన్, పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. ఈ ఆడియో టేపులపై విచారణ జరిపి ప్రజలకు నిజానిజాలను తెలియజేయాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపైన ఉందన్నారు.
Next Story

