Tue Mar 24 2026 03:01:04 GMT+0530 (India Standard Time)
వైసీపీ కండువా కప్పేసుకున్నాడు

బెజవాడలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రవేశించగానే టీడీపీ నేత యలమంచలిరవి పార్టీలో చేరిపోయారు. జగన్ పాదయాత్ర కనకదుర్గమ్మ వారధికి చేరుకోగానే పెద్దయెత్తున తన అనుచరులతో వచ్చిన రవి జగన్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీలోకి జగన్ కండువా కప్పి యలమంచలి రవికి స్వాగతం పలికారు. రవి రాకతో బెజవాడలో పార్టీ మరింత బలపడనుందని జగన్ అన్నారు. జగన్ పాదయాత్ర కొద్దిసేపటి క్రితమే బెజవాడలోకి ప్రవేశించింది.
Next Story

