యడ్డీ సూపర్ అప్పా...!

యడ్యూరప్ప చెప్పిందే నిజమైంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన రోజునే యడ్యూరప్ప స్పష్టంగా చెప్పారు. పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. తాను ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు కూడా చెప్పారు. అంతేకాదు ప్రమాణస్వీకారానికి ఎవరెవరు అతిథులు వస్తున్నారో కూడా వివరించారు. యడ్డీలోని కాన్ఫిడెన్స్ కర్ణాటక ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. యడ్యూరప్ప ఇక వర్గానికిచెందిన నాయకుడిగానే ముద్ర ఉంది. లింగాయత్ వర్గానికి చెందిన నాయకుడిగానే ఆయనకు గుర్తింపు ఉంది.
టిక్కెట్లు ఇవ్వకున్నా.....
అయితేనేం బీజేపీ రాష్ట్ర సారథ్యం తానే తీసుకున్నారు. ఎన్నికలకు ముందే కర్ణాటక రాష్ట్రమంతటా పరివర్తన్ యాత్ర చేశారు. దళితుల ఇంట భోజనాలు చేశారు. టిక్కెట్ల కేటాయింపులో తనకు అధిష్టానం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకున్నా పట్టించకోలేదు. కుమారుడికి, సన్నిహితులకు టిక్కెట్లు ఇచ్చేందుకు పార్టీ నిరాకరించినా ఆయన బీజేపీ గెలుపుకోసమే కృషి చేశారు. మోడీ, అమిత్ షాల ప్రచారం ఎన్నికల ముందు జరిగితే ఏడాది నుంచి యడ్యూరప్ప జనంలోనే ఉన్నారు. వారితోనే మమేకమయ్యారు.
నేడు ఢిల్లీకి......
ఇదిలా ఉండగా యడ్యూరప్ప ఈరోజు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. ఈ నెల 17వ తేదీన తాను ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పిన యడ్యూరప్పకు అలాంటి సానుకూల పరిణామాలే ఫలితాల్లో కన్పించాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా బీజేపీ చేరుకోకపోవడంతో కొంత ఆందోళన కన్పిస్తోంది. అతిపెద్ద పార్టీగా అవతరించినా జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవచ్చన్న వ్యూహంలో బీజేపీ ఉంది. మొత్తం మీద కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో యడ్డీ కృషి చెప్పలేనిదంటున్నారు కమలనాధులు.
- Tags
- amith shah
- bharathiya janatha party
- devegouda
- indian national congress
- janathadal s
- karnataka
- karnataka assembly elections
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- yadurppa
- అమిత్ షా
- కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- కర్ణాటక
- కుమారస్వామి
- జనతాదళ్
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- యడ్యూరప్ప
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
