Mon Mar 23 2026 00:57:11 GMT+0530 (India Standard Time)
మాదే విజయమన్న యడ్డీ

కర్ణాటక ఎన్నికల్లో విజయం తమదేనని బీజేపీ సీఎం అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అభిప్రాయపడ్డారు. ఆయన కొద్దిసేపటి క్రితం షికారిపుర లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్ధరామయ్య సర్కార్ పై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని, ఈ ఎన్నికల్లో విజయం బీజేపీదేనని ఆయన తేల్చి చెప్పారు. కన్నడ నాట కాంగ్రెస్ జిమ్మిక్కులు చెల్లవన్నారు. పూర్తి స్థాయి మెజారిటీతో బీజేపీయే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని యడ్యూరప్ప అన్నారు.
Next Story

