Thu Mar 19 2026 04:10:14 GMT+0530 (India Standard Time)
జగన్ యాత్రకు స్మాల్ బ్రేక్...!

వైసీపీ అధినేత ప్రజాసంకల్ప పాదయాత్రకు చిన్న బ్రేక్ పడింది. ఆయన ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తుండటంతో జగన్ నైట్ క్యాంప్ లోనే ఉండిపోయారు. ఈరోజు సాయంత్రం ద్రాక్షారామంలో జరగాల్సిన బహిరంగ సభను రేపటికి వాయిదా వేశారు. మధ్యాహ్మానానికి వర్షం తెరపిస్తే పాదయాత్ర కొనసాగించే అవకాశాలున్నాయి. ఇటీవల వర్షం కారణంగా యాత్రకు ఒకరోజు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర వర్షం తగ్గితే మధ్యాహ్నం నుంచి బయలుదేరే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ 2,470 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
Next Story

