Thu Mar 19 2026 10:38:33 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ రూ.కోటి సాయం

కేరళలో ముంచెత్తిన వరదలను చూసి వైసీపీ అధినేత జగన్ చలించిపోయారు. కేరళలో ఆపన్నులను ఆదుకునేందుకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్న జగన్ కోటి రూపాయాలను విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున కేరళకు కోటి రూపాయలను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కేరళ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కేరళను ఆదుకునేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా తన వంతు సాయం ప్రకటించారు.
Next Story

