Wed Mar 18 2026 22:50:11 GMT+0530 (India Standard Time)
టార్గెట్ చేస్తున్నారన్న జగన్....!

ఒక వర్గం మీడియా తనను టార్గెట్ చేసిందని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ ఛార్జిషీటులో తన భార్య పేరు ఉందని ఒక వర్గం మీడియా ప్రచారానికి దిగడం పట్ల ఆయన ఆవేదన చెందారు. చివరకు తన కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్ట లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఈ వార్తలు తనకు ఆశ్చర్యం కల్గించిదన్నారు జగన్. జగన్ సతీమణి వైఎస్ భారతిని భారతి సిమెంట్స్ కేసులో ఎన్ ఫోర్ష మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీటులో నిందితురాలిగా చేర్చారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Next Story

