చుట్టేసిన జగన్.....!

వైసిపి చీఫ్ ఏపీలో ఇప్పటివరకు సాగించిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఒక ఎత్తయితే తూర్పుగోదావరి జిల్లాలో ఆయన యాత్ర ఒక రికార్డ్ గా సాగింది. రెండు నెలలపాటు వైసిపి అధినేత జగన్ సుదీర్ఘ పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లాలో ఆయన చేయడం ఒక విశేషమని చెప్పాలి. రాజమహేంద్రి రోడ్ కం రైలు వంతెన మీదుగా పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి జూన్ 12 న అడుగుపెట్టారు. ఆయన రాకను స్వాగతిస్తూ వేలాదిమంది చారిత్రక వారధిపైకి రావడంతో బ్రిడ్జి షేక్ అయ్యింది. అదే ఉత్సహం తూర్పు పర్యటనలో ప్రతి నియోజకవర్గంలో వైసిపి శ్రేణులు చూపించడంతో జగన్ హుషారుగా సాగారు. ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జిల్లాలో చివరిగా తుని నియోజకవర్గంలో పర్యటించాలిసి వుంది.
నేతల వత్తడితోనే ...
రాజమండ్రి ఎంట్రీ అదిరిపోవడంతో జగన్ తన షెడ్యూల్ కాకుండా పార్టీ నేతల వత్తిడితో రూట్ మ్యాప్ మారుస్తూ రావాలిసివచ్చింది. నడిచే దూరం కూడా పెరిగిపోతూ వచ్చింది. తూర్పు గోదావరి అతి పెద్ద జిల్లా కావడం మూడు పార్లమెంట్ స్థానాలు 19 నియోజకవర్గాలు ఉండటం పర్యటన సుదీర్ఘంగా సాగడం లో ఒక కారణం. మరో పక్క ప్రతి శుక్రవారం సిబిఐ కోర్ట్ కి వెళ్ళలిసి రావడం మరో కారణం. అలాగే వర్షాకాలం కావడం తరచూ పర్యటనలో భారీ వర్షాలు కురవడంతో వైసిపి చీఫ్ సుదీర్ఘ పాదయాత్రకు ఇంకో కారణం గా నిలిచాయి.
ప్రత్యేక దృష్టి.......
అదే విధంగా పార్లమెంట్లో కీలక పరిణామాలపై పార్టీ ముఖ్య నేతలతో తరచూ జగన్ సమావేశం అవుతూ వారికి దిశా నిర్ధేశం చేయాలిసి రావడం కూడా టూర్ సాగుతూ వచ్చేలా చేశాయి. ఒక్క రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాలు మాత్రమే ఆయన టచ్ చేయకుండా జగన్ దాదాపు 17 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేయడం గమనిస్తే వైసిపి అధినేత తూర్పు పై గట్టి దృష్టి పెట్టారన్నది స్పష్టం అవుతుంది. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలు వైసిపికి మైనస్ కావడంతో ఈసారి జగన్ తన సుదీర్ఘ పర్యటనతో ప్లస్ గా మార్చాలన్న కృషి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
- Tags
- andhra pradesh
- ap politics
- east godavari district
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- prajasankalpa padayathra
- rajanagaram
- rampachodavaram
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తూర్పు గోదావరి జిల్లా
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రజాసంకల్ప పాదయాత్ర
- రంపచోడవరం
- రాజానగరం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
