Tue Feb 03 2026 00:36:51 GMT+0000 (Coordinated Universal Time)
చెప్పేసిన జగన్....!

వైసీపీ అధినేత జగన్ తేల్చి చెప్పేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని వైసీపీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన భారతీయ జనతా పార్టీకి తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని చెప్పారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగానే ఓటు వేస్తామని విజయసాయి రెడ్డి చెప్పారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో బీజేపీకి దూరంగా ఉండాలని వైసీపీ భావిస్తోంది. రాజ్యసభలో వైసీపీకి ఇద్దరు సభ్యులున్నారు.
Next Story
