Mon Feb 02 2026 18:52:00 GMT+0000 (Coordinated Universal Time)
ఒక కిలోమీటరు మాత్రమే నడిచిన జగన్...?

వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన నిన్న తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తి క్రాస్ రోడ్స్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చెందుర్తి క్రాస్ మీదుగా చేబ్రోలు జంక్షన్ వరకూ ఒక్క కిలోమీటరు మాత్రమే పాదయాత్ర చేశారు. అనంతరం పాదయాత్రకు విరామమిచ్చి హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. మరికాసేపట్లో జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ప్రతి శుక్రవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ హైదరాబాద్ లోని సీబీఐ న్యాయస్థానానికి హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు కోర్టు విచారణ ముగిసిన అనంతరం జగన్ తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకోనున్నారు.
Next Story
