Sun Dec 14 2025 01:46:02 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ రెడీ అవుతున్నారు....!!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన ప్రజాసంకల్ప పాదయాత్రను వచ్చే నెల3వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈమేరకు ఆయన పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 3వతేదీన విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ప్రారంభమయ్యే పాదయాత్ర రెండు రోజుల పాటు సాగుతోంది. ఆ తర్వాత 6వ తీదీన పాదయాత్ర పార్వతీపురం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఆరోతేదీన పార్వతీపురం జిల్లాలో జరగే బహిరంగ సభలో జగన్ తనపై జరిగిన హత్యాయత్నాన్ని గురించి ప్రస్తావించే అవకాశముంది. దీపావళి కావడంతో 7,8,9 తేదీల్లో పాదయాత్రకు విరామం ప్రకటించారు. 10వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. వచ్చేనెల17వ తదేీనీ జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనుంది.
Next Story
