Mon Mar 23 2026 21:46:28 GMT+0530 (India Standard Time)
వైద్య పరీక్షల తర్వాతే...జగన్....?

జగన్ పై హత్యాయత్నం జరగడంతో ప్రజాసంకల్ప పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఈరోజు, రేపు ప్రజాసంకల్ప పాదయాత్ర ఉండదు. మరోసారి వైద్యులు జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యుల సూచన మేరకే పాదయాత్ర ఉంటుందని వైసీపీ వర్గాలు స్పష్టం చేశాయి. వైద్య పరీక్షల తర్వాతే పాదయాత్ర ఎప్పుడు ఉండేది ప్రకటిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాగా జగన్ వారం రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలో జరుగుతున్న విషయం తెలిసిందే.
Next Story

