Sat Mar 21 2026 19:21:08 GMT+0530 (India Standard Time)
జగన్ ను అలెర్ట్ చేసిన.....!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖ జిల్లాలో జరుగుతుంది. రేపు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించనుంది. మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను కాల్చి చంపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయనగరం జిల్లలోకి రేపు జగన్ పాదయాత్ర ప్రవేశించనుండటంతో జగన్ కు మరింత భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయించారు. జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను అడిగి తీసుకున్న పోలీసులు అడగడుగునా భద్రత కల్పించాలని నిర్ణయించారు. జగన్ రాత్రి వేళ బస చేసే ప్రాంతం వద్ద కూడా భద్రతను మరింత పెంచనున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story

