Sat Mar 21 2026 14:03:13 GMT+0530 (India Standard Time)
రెండు రోజుల నుంచి జగన్...?

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర రెండు రోజుల నుంచి జరగడం లేదు. గురువారం భారీ వర్షం కారణంగా ఆయన పాదయాత్రకు విరామం ప్రకటించారు. గురువారం పాదయాత్ర ప్రారంభించడానికి జగన్ బయలుదేరే సమయంలో వర్షం విపరీతంగా పడుతుండటంతో ఆయన యాత్రను విరమించుకున్నారు. పప్పలవాని పాలెంలోని శిబిరంలోనే ఆయన బసచేశారు. జగన్ శిబిరం వద్దకు ప్రజలు వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఇక శుక్రవారం కూడా జగన్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. మొహరం పండగ సందర్భంగా పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. తిరిగి యాత్ర శనివారం ప్రారంభమవుతుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా శిబిరంలోనే ఉన్న జగన్ పలువురు సీనియర్ నేతలు కలిశారు.
Next Story

