రైలు అంటించింది ఆయనే అంటున్నారు ....?

ఏపీలో ఎన్నికల వేడి బాగా పెరిగిపోయింది. ప్రధాన పక్షాలు తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలతో ప్రత్యర్థులను అల్లడిస్తున్నాయి. తెలుగుదేశం, వైసిపి, జనసేన, బిజెపి నడుమ నిత్యం నడుస్తున్న మాటల యుద్ధం లో పంచ్ డైలాగ్స్ మాటల తూటాలు పేలిపోతున్నాయి. పార్టీల అధినేతలు చేస్తున్న వ్యాఖ్యలు బ్రేకింగ్ న్యూస్ లుగా మారడం రొటీన్ అయిపొయింది. తాజాగా వైసిపి అధినేత జగన్ తుని బహిరంగ సభలో టిడిపి అధినేత చంద్రబాబు పై చేసిన ఆరోపణలు పొలిటికల్ హీట్ రేంజ్ తెలియచేస్తున్నాయి.
తుని సంఘటన కు కుట్ర ఆయనదే ...
ముద్రగడ పద్మనాభం గతంలో నిర్వహించిన కాపు రిజర్వేషన్ సభ అనంతరం తుని లో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుకి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అనేక కేసులు అప్పుడు నమోదు అయ్యాయి . ఆ సంఘటనపై ఇప్పటివరకు సర్కార్ ఎలాంటి కఠిన చర్యలకు దిగే సాహసం చేయలేదు. కేసులు పెట్టి అవసరమైనప్పుడు ముద్రగడ ఆయన అనుచరులను అరెస్ట్ చేసింది. ఆ తరువాత అనేకమంది ఈ కేసుల్లో పోలీస్ స్టేషన్ లు కోర్ట్ ల చుట్టూ తిరుగుతూనే వున్నారు. దీనిపై ముద్రగడ కేసులు ఎత్తివేయాలంటూ చేసిన నిరాహారదీక్షలో హామీ ఇచ్చిన సర్కార్ అందుకు అనుగుణంగా చర్యలు మాత్రం చేపట్టలేదు. అయితే ఈ అంశాన్ని తుని లో వైసిపి అధినేత జగన్ ప్రస్తావించడం మరోసారి కలకలం రేపింది. రైలును చంద్రబాబు కుట్ర చేసి తగులబెట్టించి అమాయక ప్రజలపై మాత్రం కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆరోపించారు జగన్.
రైలు దహనం రాజకీయ అస్త్రంగా ...
చంద్రబాబు కుట్ర పన్ని ఇప్పటివరకు 75 శాతం మంది కి పైగా వైసిపి క్యాడర్ పై కేసులు పెడుతున్నట్లు జగన్ ఆరోపించారు. రైలు దహనం అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలిచి టిడిపి ని ఇరకాటంలో పెట్టాలన్న ఎత్తుగడతో నాటి ఈ వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు వైసిపి అధినేత. టిడిపి అధినేతపైనే నేరుగా తీవ్ర ఆరోపణలు చేయడం తద్వారా ఈ కేసులపై రైలు దహనంపై ఎదో ఒకటి టిడిపి జవాబు చెప్పుకోవాలిసిన అవసరాన్ని కల్పించారు జగన్. యధావిధిగా వైసిపి నే ఈ అరాచకానికి పాల్పడిందని టిడిపి ఆరోపించడం రొటీన్. వైసిపి సైతం నాడు కాపు రిజర్వేషన్ అంశంపై తమ పార్టీ పోరాటాన్ని దాన్ని టిడిపి కేసులు పెట్టిన వైనాన్ని చర్చ పెట్టడంద్వారా కాపు సామాజిక వర్గం కోసం చేస్తున్న త్యాగాలను గుర్తు చేయాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- mudragada padmanabham
- nara chandrababu naidu
- pavan kalyan
- telugudesam party
- tuni rail incident
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తుని రైలు ఘటన
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబు నాయుడు
- పవన్ కల్యాణ్
- ముద్రగడ పద్మనాభం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

