Thu Mar 19 2026 18:18:00 GMT+0530 (India Standard Time)
షర్మిలను మిస్సవుతున్నా

షర్మిలను తాను ఈరోజు మిస్సవుతున్నానని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ట్విట్టర్లో ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోని అక్కా చెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ప్రస్తుతం ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. తాను ప్రతి ఏడాది రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొంటానని, ఈసారి తన చెల్లెలు షర్మిలను మిస్సవుతున్నానని తెలిపారు. షర్మిలకు తన ఆశీస్సులను అందజేశారు. మిస్సింగ్ యూ ఆన్ రాఖీ అని జగన్ ట్వీట్ చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాతో సహా పలువురు జగన్ కు రాఖీలు కట్టారు.
Next Story

