Sat Mar 21 2026 05:34:27 GMT+0530 (India Standard Time)
విశాఖలోనే జగన్ నేడు....?

విశాఖపట్నం నగరంలో జరుగుతున్న వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. వినాయక చవితి సందర్భంగా జగన్ పాదయాత్ర నేడు చేయరని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకూ విశాఖ నగరంలో ఉత్తర, దక్షిన నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తయింది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విశాఖ పశ్చిమలో జరుగుతుంది. వినాయక చవితి సందర్భంగా వైఎస్ జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరారు.
Next Story

