Sat Jan 31 2026 05:08:23 GMT+0000 (Coordinated Universal Time)
ట్వీట్ పేల్చిన జగన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు. తన ట్వీట్ లో ఆయన చంద్రబాబును తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. నిన్న నాయీ బ్రాహ్మణులు తమ సమస్యలను చెప్పుకోవడానికి సచివాలయానికి వస్తే వారిని దూషించడం ఎంతవరకూ సమంజసమని జగన్ ప్రశ్నించారు. నాగరిక సమాజంలో ఉన్న మనం ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. చంద్రబాబు అహంకారానికి ఈ సంఘటన నిదర్శనమన్నారు. చంద్రబాబుకు బీసీల పట్ల కపట ప్రేమేనని మరోసారి రుజువయిందన్నారు జగన్. తాము అధికారంలోకి వస్తే టీటీడీతో సహా అన్ని దేవాలయల కమిటీల్లో నాయీ బ్రాహ్మణులను సభ్యులుగా చేరుస్తామని, వారిని గౌరవిస్తామని జగన్ పేర్కొన్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- nara chandrababu naidu
- nayee brahmin
- prajasankalpa padayathra
- telugudesam party
- tweet
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- ట్వీట్
- తెలుగుదేశం పార్టీ
- నాయీ బ్రాహ్మణులు
- నారా చంద్రబాబునాయుడు
- ప్రజాసంకల్పపాదయాత్ర
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story
