Tue Mar 24 2026 03:46:31 GMT+0530 (India Standard Time)
జనం మంచి కోసమే జగన్ పై దాడి చేశా...!!

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశానని శ్రీనివాస్ అనే నిందితుడు కేకలు పెట్టారు. గత మూడు రోజులుగా పోలీసు విచారణలో ఉన్న శ్రీనివాస్ ను కొద్దిసేపటి క్రితం విశాఖపట్నంలోని కేజీహెచ్ కు వైద్య పరీక్షల కోసం తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తో మాట్లాడించేందుకు మీడియా ప్రయత్నించింది. అయితే మీడియాతో మాట్లాడకుండా పోలీసులు శ్రీనివాస్ ను అడ్డుకున్నారు. దీంతో శ్రీనివాస్ తనకు ప్రాణహాని ఉందని గట్టిగా కేకలు పెట్టారు. తాను మరణిస్తే తన అవయావాలు దానం చేయాలని కూడా శ్రీనివాస్ బిగ్గరగా కేకలు పెట్టాడు. ఈ నెల 25వ తేదీన విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై కత్తితో శ్రీనివాస్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు గుండె దడగా ఉందని చెప్పడంతో శ్రీనివాస్ ను కేజీహెచ్ కు తీసుకు వచ్చారు. ప్రజలతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానని గట్టిగా శ్రీనివాస్ కేకలు పెట్టడం విశేషం.
- Tags
- andhra pradesh
- ap politics
- attack
- kgh
- knife
- nara chandrababu naidu
- srinivas
- telugudesam party
- visakha airport
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కత్తి
- కేజీహెచ్
- తెలుగుదేశం పార్టీ
- దాడి
- నారా చంద్రబాబునాయుడు
- విశాఖ ఎయిర్ పోర్టు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- శ్రీనివాస్
Next Story

