Sun Mar 22 2026 18:31:19 GMT+0530 (India Standard Time)
తిత్లీ దెబ్బకు జగన్ పాదయాత్ర...?

తిత్లీ దెబ్బకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. తిత్లీ తుపాను హెచ్చరికలతో పాదయాత్రకు విరామం ప్రకటిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. నిజానికి నేడు విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే తుపాను హెచ్చరికల నేపథ్యంలో జగన్ యాత్ర నేడు జరగడం లేదు.
Next Story

