Thu Mar 19 2026 06:09:44 GMT+0530 (India Standard Time)
నేడు యాత్రకు బ్రేక్

వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన పాదయాత్రకు విరామమిచ్చారు. కొద్దిసేపటి క్రితం విశాఖ జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని యర్రవరంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈరోజు యర్రవరంలోనే జగన్ విశ్రాంతి తీసుకోనున్నారు. ప్రజలకు జగన్ 72వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను ట్విట్టర్ లో తెలిపారు. రేపటి నుంచి యధావిధిగా ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం కానుంది.
Next Story

