Wed Mar 18 2026 05:48:52 GMT+0530 (India Standard Time)
జగన్ పాదయాత్రపై ప్రభావం....!

ముద్రగడ జగన్ వ్యాఖ్యలపై ఫైర్ కావడంతో ఆ ప్రభావం జగన్ పాదయాత్రపై చూపింది. నిన్న జగ్గంపేటలో కాపు రిజర్వేషన్ల అమలు కేంద్రం పరిధిలో ఉందని, తాను ఆ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేనని జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ముద్రగడ ఫైరయ్యారు. జగన్ కాపులపై సవతి తల్లి ప్రేమ చూపారని ఆరోపించారు. ఈనేపథ్యంలో ఈరోజు జగన్ పాదయాత్ర ముద్రగడ సొంత గ్రామమైన కిర్లంపూడిలోనే జరుగుతోంది. దీంతో కొందరు కాపు యువకులు జగన్ పాదయాత్రను అడ్డుకున్నారు. కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని ఇవ్వాలని నినాదాలు చేశారు. తమను మోసం చేయవద్దంటూ గట్టిగా నినదించారు. దీంతో జగన్ ప్రయివేటు సెక్యూరిటీ గార్డ్స్ ఆందోళన చేస్తున్న యువకులను పక్కకు నెట్టేశారు. తర్వాత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- kapu reservations
- mudragada padmanabham
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- telugudesam party
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కాపు రిజర్వేషన్లు
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబు నాయుడు
- పవన్ కల్యాణ్
- భారతీయ జనతా పార్టీ
- ముద్రగడ పద్మనాభం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

