Sun Mar 22 2026 17:18:17 GMT+0530 (India Standard Time)
జగన్ ఆటోవాలా అవతారం

వైసీపీ అధినేత జగన్ ఆటోవాలా అవతారమెత్తాడు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న జగన్ ను ఆటోవాలాలు కలిశారు. తమ సమస్యలను జగన్ కు వివరించారు. డీజల్, పెట్రోల్ రేట్లు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ వారికి వైసీపీ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదివేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ ఆటోవాలా వేసుకునే యూనిఫాం వేసుకున్నారు. కొద్దిదూరం ఆటోనడిపారు. జగన్ యూనిఫాం వేసుకుని ఆటో నడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Next Story

