Thu Mar 19 2026 07:02:06 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర రద్దు....ఎందుకంటే?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఈరోజు రద్దయింది. ప్రస్తుతం అమలాపురం నియోజకవర్గంలో ప్రజాసంకల్ప పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే కోనసీమలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటం, రోడ్లన్నీ చిత్తడిగా మారడంతో నడవలేని పరిస్థితి ఉంది. దీంతో వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్ర ఈరోజు రద్దయింది. అలాగే రేపు జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అందువల్ల జగన్ అమలాపురం నియోజకవర్గం నుంచి నేరుగా హైదరాబాద్ కు బయలుదేరారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే జగన్ ఉండనున్నారు. రేపు సీబీఐ కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత తిరిగి తూర్పుగోదావరి జిల్లాకు చేరుకోనున్నారు.
Next Story

