Mon Feb 02 2026 13:14:29 GMT+0000 (Coordinated Universal Time)
జగన్నాటకం బయటపెట్టండి

వై.ఎస్. జగన్ నాటకాన్ని పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. జగన్ కాపు రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్లమెంటు సభ్యులకు పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రిజర్వేషన్లు తీసుకురావాల్సి ఉండగా జగన్ తన కేసుల కోసం బీజేపీ సర్కార్ తో లాలూచీ పడుతున్నారన్నారు. మరోసారి జగన్నాటకం బయటపడిందని చంద్రబాబు నాయుడు ఎంపీలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజలందరి దృష్టి ఎంపీల పోరాటంపైనే ఉందన్నారు. విభజన హామీల కోసం గట్గిగా పోరాడాలన్నారు. పార్లమెంటులో హామీలిచ్చి, సుప్రీంకోర్టులో మాత్రం అందుకు విరుద్థంగా పెండింగ్ లో ఉందన్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్ లోచేర్చే అంశంపై కేంద్రంపై వత్తిడి తేవాలని చంద్రబాబు ఎంపీలను కోరారు.
Next Story
