Mon Feb 02 2026 12:02:15 GMT+0000 (Coordinated Universal Time)
జగన్... మా ఓట్లడగొద్దు.....!

వైసీపీ అధినేత జగన్ కాపురిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ ఫైరయ్యారు. కాపు రిజర్వేషన్లపై జగన్ యూ టర్న్ తీసుకున్నారన్నారు. కాపులను జగన్ అవమానపర్చారన్నారు. కాపులను ఓట్లు అడిగే నైతిక హక్కు జగన్ కు లేదని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుపై తమకు నమ్మకం ఉందని, తమకు మద్దతిచ్చే వారికే వచ్చే ఎన్నికల్లో ఓట్లేస్తామని ముద్రగడ చెప్పారు. కేంద్ర పరిధిలోని అంశాలపై ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారని ముద్రగడ ప్రశ్నించారు. కేంద్ర పరిధిలోని అంశం కాబట్టి కాపు రిజర్వేషన్లపై తాను హామీ ఇవ్వలేనని నిన్న జగన్ జగ్గంపేటలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- kapu reservations
- mudragada padmanabham
- nara chandrababu naidu
- pavan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కాపు రిజర్వేషన్లు
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ముద్రగడ పద్మనాభం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story
