Tue Mar 24 2026 09:05:25 GMT+0530 (India Standard Time)
జగన్ తో మోహన్ బాబు...!!

ఇటీవల విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిలో గాయపడిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సినీనటుడు మోహన్ బాబు పరామర్శించారు. లోటస్ పాండ్ కు వెళ్లి జగన్ ఆరోగ్యం గురించి ఆరాతీశారు. జగన్ కోలుకుంటున్నారని, ఆయన నూరేళ్లు బతకాలని తాను కోరుకుంటున్నట్లు మోహన్ బాబు మీడియాతో తెలిపారు. జగన్ గత నెల 25వ తేదీన దాడి జరగడంతో గాయపడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు ఇంకా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. వైద్యుల సలహా మేరకు పాదయాత్రను కూడా ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసుకున్నారు.
Next Story

