Sat Mar 21 2026 01:05:16 GMT+0530 (India Standard Time)
లోటస్ పాండ్ నుంచి జగన్...?

వైసీపీ అధినేత జగన్ నేడు సీబీఐ కోర్టుకు మరికాసేపట్లో హాజరుకానున్నారు. గత రెండు వారాలుగా జగన్ కోర్టుకు హాజరుకాలేదు. వేసవి సెలవులు కావడంతో ఆయన కోర్టుకు హాజరుకాలేదు. కాని సీబీఐ కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరుకావాల్సి ఉండటంతో నిన్న సాయంత్రమే ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. లోటస్ పాండ్ లో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో కూడా భేటీ అయ్యారు. ఈరోజు సీబీఐ కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత తిరిగి జగన్ పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకోనున్నారు.
Next Story

