Tue Feb 03 2026 00:35:40 GMT+0000 (Coordinated Universal Time)
ట్విట్టర్లో జగన్ ఫైర్....!

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ట్విట్టర్లో ఫైరయ్యారు వైసీపీ అధినేత జగన్. మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేస్తుంటే...వారిపై నిరంకుశంగా దాడి చేయడం అమానుషమని కొద్దిసేపటి క్రితం జగన్ ట్వీట్ చేశారు. మహిళల పట్ల చంద్రబాబుకు ఎంత గౌరవముందో దీన్ని బట్టే తెలుస్తుందన్నారు. మహిళ పార్లమెంటును విజయవాడలో నిర్వహించామని గొప్పలు చెప్పే చంద్రబాబు అదే విజయవాడలో ఆందోళన చేస్తున్న మహిళల పట్ల అత్యంత హేయంగా ప్రభుత్వం ప్రవర్తించిందన్నారు. పిల్లలకు భోజనం వండిపెట్టే మధ్యాహ్న పనివారలను తొలిగించి ప్రయివేటు ఏజెన్సీకి అప్పజెప్పడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడితే మధ్యాహ్న భోజన కార్మికులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
Next Story
