Thu Mar 26 2026 02:40:08 GMT+0530 (India Standard Time)
జగన్ ఫిదా అయ్యారట...!!!

వైసీపీ ఎమ్మెల్యే కళావతి చూపిన ఆదరాభిమానాలకు జగన్ ఫిదా అయ్యారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన బహిరంగసభలో ఆయన తన విషయం ప్రస్తావించినప్పుడు ఎమ్మెల్యే కళావతి కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కళావతి పార్టీని నమ్ముకునే ఉన్నారు. జగన్ తోనే కలసి ఉన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆమె పార్టీని వీడలేదని, కళావతి తనకు అక్క లాంటి వారని, ఆమెను తన జన్మలో ఎన్నటికీ మర్చిపోనని, తన గుండెల్లో ఆమెకు స్థానం ఉందని జగన్ చెప్పారు. కళావతి లాంటి వారు పార్టీని నమ్ముకుని ఉంటే... డబ్బుల కోసం కక్కుర్తి పడి పెద్ద మనుషులు వెళ్లిపోయారని జగన్ అన్నారు. పాలకొండ సభ ఊహించని విధంగా సక్సెస్ అయింది.
Next Story

