జగన్ కేసులో ఏమి తేల్చనున్నారో....!!!

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు నేడు హైకోర్టు విచారించనుంది. తనపై హత్యాయత్నం వెనక కుట్ర దాగి ఉందని, ఏపీ పోలీసులు, ప్రభుత్వం అజమాయిషీ లేని విచారణ సంస్థచేత దర్యాప్తు జరిపించాలని జగన్ ఇటీవల హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో భద్రతా వైఫల్యంపై ఇప్పటికే దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో కలిపి మంగళవారం హైకోర్టు విచారణ జరపనుంది.
పోలీసులపై అనుమానం.....
అంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీసీ అధినేత వైఎస్ జగన్ హత్యాయత్నం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మరో వైపు దాడిపై ఎన్నో అనుమానాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ పోలీసుల విచారణ తీరుపైనా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నిందితుడు శ్రీనివాస్ ను కస్టడీకి తీసుకున్నా ఏమీ తేల్చలేక పోవడం. తిరిగి కస్టడికి అడిగే సమయంలో నిర్లక్షంగా వ్యవహరించడం వంటివి పలు అనుమానాలకు తావిస్తున్నాయి. కుట్రకోణంలో ఇప్పటికి పోలీసులు దర్యాప్తు జరపక పోగా కనీసం కుట్రకోణం 120(b) కింద కేసు కూడా నమోదు చేయలేదు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా డీజీపీ ఇతర మంత్రులు అధికారులు వ్యవహరించిన తీరు ఆధారాలతో సహా జగన్ తరుపు న్యాయవాదులు వివరించనున్నారు.
మూడు పిటీషన్లనూ....
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు నేపధ్యంలో ఇప్పటికే హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్,జగన్ వేసిన రిట్ పిటిషన్ తో పాటు గతంలో ధాఖలు అయిన ప్రజాప్రయోజన వాజ్యంతో కలిపి విచారిస్తామని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును థర్డ్ పార్టీ ఏజెన్సీ తో విచారణ జరిపించాలని, ఆంధ్రప్రదేశ్ అజామాయిషీ లేని స్వచ్ఛంద ధర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పిటిషన్ లో పేర్కోన్నారు జగన్. ఈ పిటిషన్ లో ఎనిమిది మంది ప్రతివాదులను చేరుస్తూ పదకొండు పేజీల పిటిషన్ ను హైకోర్ట్ లో దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటూ ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీ హోం, యూనియన్ ఆఫ్ ఇండియా మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ,ఏపీ డీజీపీ, తెలంగాణ డిజిపి. ఎయిర్ పోర్ట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిట్ ఇంచార్జ్ అధికారి లను ప్రతివాధులుగా చేర్చారు. ఏపీ ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి కావడంతో కేసు కీలకంగా మారింది. నేటి విచారణ లో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది కీలకంగా మారింది.
- Tags
- andhra pradesh
- ap politics
- attack
- highcourt
- knife
- nara chandrababu naidu
- srinivas
- telugudesam party
- visakha airport
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కత్తి
- తెలుగుదేశం పార్టీ
- దాడి
- నారా చంద్రబాబునాయుడు
- విశాఖ ఎయిర్ పోర్టు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- శ్రీనివాస్
- హైకోర్టు

