Mon Feb 02 2026 21:52:43 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు జ్వరం...పాదయాత్ర...?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ జలుబు, దగ్గు,జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన అస్వస్థతకు గురవ్వడంతో పాదయాత్రను అనుకున్న సమయానికి ముందే ముగించారు. వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంనియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈరోజు పాదయాత్ర ప్రారంభించిన కొద్దిసేపటికే ఆయనకు జలుబు, జ్వరం రావడంతో వైద్యులు వచ్చి పరీక్షించారు. ప్రస్తుతం 228వ రోజు ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. వర్షానికి తడవడటం వల్లనే జగన్ అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు.
Next Story
