Tue Mar 24 2026 19:42:20 GMT+0530 (India Standard Time)
నేడు కోర్టుకు జగన్....?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు సీబీఐ కోర్టుకు హాజరు కావడం లేదు. ఆయనపై ఇటీవల హత్యాయత్నం జరగడంతో భుజానికి గాయం అయి తొమ్మిది కుట్లు పడ్డాయి. వైద్యుల సూచన మేరకు జగన్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈరోజు వాస్తవానికి సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కావాల్సి ఉంది. కానీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను కోర్టుకు హాజరుకాలేనని జగన్ తరుపున న్యాయవాది కోర్టుకు వివరించనున్నారు. దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను కోర్టుకు సమర్పించనున్నారు.
Next Story

