Fri Mar 27 2026 20:55:41 GMT+0530 (India Standard Time)
జగన్ తో చేయి కలిపిన సినీహీరో

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి టాలీవుడ్ నుంచి సంఘీభావం పెరుగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు సినీనటులు సంఘీ భావం ప్రకటించారు. తాజాగా జగన్మోహన్ రెడ్డికి సినీనటుడు భానుచందర్ తన సంఘీభావాన్ని ప్రకటించారు. జగన్ వెంట ఆయన కొంతదూరం పాదయాత్ర చేశారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 329వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం టెక్కలి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. జగన్ కష్టనష్టాలకోర్చి పాదయాత్ర చేపట్టారని, జగన్ కు ప్రజలు అండగా నిలబడాలని భానుచందర్ కోరారు.
Next Story

