Mon Mar 23 2026 20:08:21 GMT+0530 (India Standard Time)
నో చెప్పిన జగన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ సిట్ పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు. విశాఖ ఎయిర్ పోర్టులో నిన్న జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటుచేసింది. అయితే జగన్ సంఘటన జరిగిన వెంటనే హైదరాబాద్ కు వచ్చి సిటీ న్యూరో సెంటర్ లోచికిత్స పొందారు. ఈరోజు ఆసుపత్రికి వచ్చిన ఏపీ సిట్ పోలీసులు జగన్ స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి ప్రయత్నించారు. అయితే జగన్ మాత్రం తనకు ఏపీ పోలీసుల విచారణపై నమ్మకం లేదని, తాను స్టేట్ మెంట్ ఇవ్వనని తేల్చిచెప్పడంతో సిట్ పోలీసులు హైదరాబాద్ నుంచి విశాఖకు తిరిగి వెళ్లారు.
- Tags
- air port
- andhra pradesh
- ap politics
- nara chandrababu naidu
- special investigation team
- statement
- telugudesam party
- visakhapatnam
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఎయిర్ పోర్ట్
- ఏపీ పాలిటిక్స్
- తెలుగుదేశంపార్టీ
- నారా చంద్రబాబు నాయుడు
- విశాఖపట్నం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- స్టేట్ మెంట్
- స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం
Next Story

