Tue Mar 24 2026 07:54:14 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర వాయిదా

జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర మరోసారి వాయిదా పడే అవకాశముంది. వాస్తవానికి రేపటి నుంచి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేయాల్సి ఉంది. అయితే భుజానికి పడిన కుట్లు ఇంకా మానకపోవడంతో వైద్యులు పాదయాత్ర వాయిదా వేసుకోవలని సూచించారు. జగన్ ఎడమ భుజం వాయడంతో ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర జరిగే అవకాశముంది. జగన్ ఎడమ భుజం కండరాలు ఇంకా నొప్పిగా ఉండటంతో ఆయన పాదయాత్ర చేయలేరని తెలుస్తోంది. గాయం పూర్తిగా మానిన తర్వాతనే పాదయాత్ర ప్రారభం కానుంది. గత నెల 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే.
- Tags
- airport
- andhra pradesh
- ap politics
- attack
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- postponed
- prajasankalpa padayathra
- srinivas
- telugudesam party
- visakhapatnam
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఎయిర్ పోర్టు
- ఏపీ పాలిటిక్స్
- తెలుగుదేశం పార్టీ
- దాడి
- నారా చంద్రబాబు నాయుడు
- ప్రజాసంకల్ప పాదయాత్ర
- వాయిదా
- విశాఖపట్నం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- శ్రీనివాస్
Next Story

