Mon Feb 02 2026 12:03:09 GMT+0000 (Coordinated Universal Time)
కఠిన నిర్ణయాలు తీసుకోవద్దన్న జగన్

ఎవరూ కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, పోరాడి మాత్రమే సాధించుకోవాలని జగన్ పిలుపు నిచ్చారు.చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన సుధాకర్ అనే యువకుడు ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు తీసుకున్నారు. దీనిపై జగన్ స్పందించారు. బతికుండి పోరాడి సాధించుకోవాలే తప్ప ప్రాణాలు తీసుకుని కుటుంబాలకు శోకాన్ని మిగిల్చ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా మన హక్కు అంటూ సుధాకర్ ఆత్మహత్య చేసుకోవడం తనను కలచి వేసిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రత్యేక హోదా ఇవ్వాలని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కోరారు.
Next Story
